BJP: 'బీజేపీ' అంటే కొత్త అర్థం చెప్పిన తెలుగుదేశం

  • బీజేపీ అంటే 'బ్రేక్ జనతా ప్రామిస్'
  • సోమవారంలోగా 50 మంది సంతకాలతో అవిశ్వాసం
  • మీడియాతో ఎంపీ తోట నరసింహం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఎన్డీయేకు 'రాంరాం' చెప్పిన తరువాత ఆ పార్టీ నేతలు మీడియా ముందు బీజేపీపైనా, ప్రధానిపైనా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని 'బ్రేక్ జనతా ప్రామిస్' అని టీడీపీ ఎంపీ తోట నరసింహం వ్యాఖ్యానించారు.

తమ అవిశ్వాస తీర్మానంపై కనీసం 50 మంది సంతకాలను సోమవారంలోగా సేకరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన, అవిశ్వాసంతో ప్రధాని నరేంద్ర మోదీ పదవికిగానీ, ప్రభుత్వానికి గానీ నష్టం ఉండబోదని, అయినా ఏపీ ప్రజల ఆగ్రహాన్ని జాతి దృష్టికి తీసుకు వెళ్లడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.

BJP
Tota Narasimham
Break Janata Promise
Narendra Modi
  • Loading...

More Telugu News