Chandrababu: నేరస్తులతో ప్రధాని స్నేహం ఏమిటి?: మోదీ- జగన్ బంధంపై చంద్రబాబు మాటల తూటాలు

  • నీరవ్ మోదీ, విజయసాయిరెడ్డిలతో నరేంద్ర మోదీ స్నేహం 
  • నీరవ్ ను విదేశాలు దాటించేందుకు సహకారం
  • సంచలన విమర్శలతో మాటల ధాటి పెంచిన చంద్రబాబు

ఈ ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా సంచలన విమర్శలు చేస్తున్న చంద్రబాబు, నీరవ్ మోదీ వంటి వేల కోట్ల మేరకు మోసం చేసిన వారిని దేశం దాటి పోనిచ్చింది స్వయంగా ప్రధానేనని ఆరోపించారు. నీరవ్ మోదీ, విజయసాయిరెడ్డి, జగన్ వంటి ప్రజాధనం మెక్కిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్న నరేంద్ర మోదీ, వారికి అండగా నిలిచారని నిప్పులు చెరిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దాలని తాము కోరుతుంటే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీపై కుట్రలు చేస్తున్న జగన్ కు మోదీ సహకరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి నిందితులకు పదే పదే పీఎంఓ అపాయింట్ మెంట్ ఇస్తోందని, మిత్రులైన తమను దూరం పెట్టిందని వ్యాఖ్యానించిన ఆయన, ఇటువంటి నేరస్తులతో ప్రధాని స్నేహం ఏంటని ప్రశ్నించారు. ఏం ఆశించి ఇప్పుడు టీడీపీపై అభాండాలు వేస్తున్నారని పవన్ ను ఉద్దేశించి అడిగారు. కేంద్రం నుంచి ఏం హామీ వచ్చిందని ప్రశ్నించారు.

Chandrababu
Nirav Modi
vijayasri reddy
Narendra Modi
  • Loading...

More Telugu News