no confidence motion: టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, వామపక్షాలు?

  • కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ
  • టీడీపీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, వామపక్షాలు
  • మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్న శివసేన, టీఎంసీ

ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. ఈ తీర్మానాలకు ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తీర్మానానికి కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. లోక్ సభలో కాంగ్రెస్ కు 48, అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు శివసేన, టీఎంసీ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

no confidence motion
Telugudesam
YSRCP
Congress
left parties
shiv sena
tmc
aiadmk
  • Loading...

More Telugu News