venky atluri: నెక్స్ట్ మూవీ కోసం థాయ్ లాండ్ కి అఖిల్

  • వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ 
  • థాయ్ లాండ్ నేపథ్యంలో కథ
  • దర్శకుడితో కలిసి అక్కడికి వెళ్లిన అఖిల్   

అఖిల్ తన మూడవ సినిమాను ఏ దర్శకుడితో చేయాలా అనే ఆలోచనతో సతమతమైపోతూ ఉండగా, 'తొలిప్రేమ' సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసిన అఖిల్ కి దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్ నచ్చేసింది. అంతే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండగా ఆయనను పిలిచి అవకాశం ఇచ్చేశాడు.

వెంకీ అట్లూరి వినిపించిన లైన్ అఖిల్ తో పాటు నాగార్జునకి కూడా నచ్చేసింది. థాయ్ లాండ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. అందువలన 60 శాతం షూటింగును అక్కడే జరపనున్నారు. కథకి పూర్తి రూపాన్ని కూడా అక్కడే తీసుకువద్దామనే ఉద్దేశంతో వెంకీ అట్లూరి .. అఖిల్ కలిసి థాయ్ లాండ్ వెళ్లినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News