Chandrababu: నా చిన్నప్పుడే మా ఊరికి రోడ్డు వేయించా : సీఎం చంద్రబాబు
- నా చిన్నప్పుడే వినాయక సంఘం ఒకటి ఏర్పాటు చేశాను
- అధ్వానంగా ఉన్న మా ఊరుకి నాడు రోడ్డు వేయించా
- ఆ రోడ్డులో బస్సు నడిచేలా చేశాను
- నాటి విషయాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు
చిన్నప్పటి నుంచి తనకు సమాజ సేవ చేయడం అలవడిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాజకీయాల్లోకి చంద్రబాబు వచ్చి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో టీడీపీ నేతలు పలువురు ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తాను చిన్నప్పుడే వినాయక సంఘం ఒకటి ఏర్పాటు చేశానని, అధ్వానంగా ఉన్న తమ ఊరుకి రోడ్డు వేయించి, బస్సు వచ్చేలా చేశానని గుర్తుచేసుకున్నారు. తాను విద్యార్థి దశలో ఉండగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ప్రజలకు సేవ చేస్తున్నామని, మన బాధ్యత నిర్వర్తిస్తున్నానని ముందుకు వెళ్లేవాడినని అన్నారు.