: కుమ్ములాటలే కొంపముంచాయి: వెంకయ్య నాయుడు
కర్ణాటక ఎన్నికల్లో పార్టీ పరాజయంపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఎన్నికల్లో కొంపముంచాయని అభిప్రాయపడ్డారు. ఓటమిని అంగీకరిస్తున్నామంటూ వెంకయ్య నాయుడు హుందాతనం ప్రదర్శించారు. ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరిస్తామని తెలిపారు.