raviteja: డిఫరెంట్ కాన్సెప్ట్ తో రవితేజ మూవీ .. దర్శకుడిగా వి.ఐ. ఆనంద్

  • వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 
  • నిర్మాతగా రామ్ తాళ్లూరి 
  • త్వరలోనే పూర్తి వివరాలు    

దర్శకుడు వి.ఐ. ఆనంద్ పేరు వినగానే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' .. ' ఒక్క క్షణం' సినిమాలు గుర్తుకు వస్తాయి. విభిన్నమైన .. ఆసక్తికరమైన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలు, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లాయి. అలాగే ఈ సారి కూడా అదే తరహా కంటెంట్ తో వి.ఐ. ఆనంద్ ఒక సినిమా చేయనున్నాడు.

 ఈ సారి ఆయన ఎంచుకున్న హీరో .. రవితేజ. ప్రస్తుతం రవితేజ 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన వి.ఐ. ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి, టైటిల్ ను గానీ .. కథానాయికను గానీ ఇంకా అనుకోలేదు. త్వరలోనే పూర్తివివరాలను ప్రకటించనున్నారు.  

  • Loading...

More Telugu News