kalyan ram: ఈ నెలలోనే 'ఎమ్మెల్యే' రిలీజ్ .. గ్లామర్ డోస్ పెంచేసిన కాజల్

  • కల్యాణ్ రామ్ జోడీగా కాజల్
  • ఈ నెల 23వ తేదీన విడుదల 
  • హిట్ ఖాయమంటోన్న అభిమానులు    

ప్రస్తుతం కల్యాణ్ రామ్ జోడీగా కాజల్ 'ఎమ్మెల్యే' సినిమా చేస్తోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు ..  టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో కాజల్ గ్లామర్ డోస్ పెంచేసినట్టు ఒక టాక్ వినిపిస్తోంది. తాజాగా వదిలిన పోస్టర్ ను చూస్తే అది నిజమేననిపిస్తోంది. కొత్త కథానాయికలతో పోటీ పడుతూ .. కాజల్ ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ, అంతకుమించిన గ్లామర్ తో ఇప్పటికీ కాజల్ కనిపిస్తూ ఉండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఆమెకి మరో హిట్ ను సంపాదించిపెట్టడం ఖాయమని అంటున్నారు.         

  • Loading...

More Telugu News