Chandrababu: ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు రేపు టీడీపీ సమావేశం
- రేపు కీలక ప్రకటన చేయనున్న చంద్రబాబు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పోరాడడం లేదంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రేపు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అంశంపై టీడీపీ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని ప్రకటన చేయనుంది.