Pawan Kalyan: ముందు మీ అన్న చిరంజీవిని ప్రశ్నించండి: పవన్ కల్యాణ్ పై పీతల సుజాత ఫైర్

  • రాజ్యసభలో పోరాటం ఎందుకు చేయలేదని ప్రశ్నించండి
  • పవన్ కల్యాణ్ కు కౌంట్ డౌన్ స్టార్టయింది
  • పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి

రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై అసత్య ఆరోపణలు చేసినందుకు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత డిమాండ్ చేశారు. ప్రశ్నించేందుకు వచ్చానని చెబుతున్న పవన్ కల్యాణ్ ముందు అతని అన్న చిరంజీవిని ప్రశ్నించాలని... రాజ్యసభకు వెళ్లకుండా, ప్రత్యేక హోదాపై పోరాటం చేయకుండా ఎందుకున్నారో నిలదీయాలని అన్నారు. ఓ ఇంటి కోసం రెండెకరాల స్థలంలో నిర్మాణం జరుపుతున్న పవన్ కల్యాణ్.,.. రాష్ట్ర రాజధాని కోసం ఇన్ని ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించడం హాస్యాస్పదమని విమర్శించారు. రాజకీయరంగంలో పవన్ కల్యాణ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు. 

Pawan Kalyan
Peethala Sujatha
Chiranjeevi
  • Loading...

More Telugu News