pnb: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన మరో కుంభకోణం

  • ముంబైలోని ఓ శాఖలో రూ.9.1 కోట్ల మోసం
  • చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ అధికారుల పాత్ర
  • తన వెబ్ సైట్లో వెల్లడించిన సీబీఐ

రూ.13,000 కోట్ల కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో కుంభకోణం వెలుగు చూసింది. ముంబైలోని ఓ శాఖలో 9.1 కోట్ల రూపాయిల కుంభకోణంలో చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అధికారుల పాత్ర ఉందని సీబీఐ తన వెబ్ సైట్ లో పేర్కొంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు గీతాంజలి జెమ్స్ అధినేత మేహుల్ చోక్సీలు కలసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడిన విషయం విదితమే. ముంబై శాఖ నుంచి ఎల్ వోయూలు సంపాదించి రూ.13,000 కోట్ల మేరకు రుణాలు పొంది తిరిగి చెల్లించకుండా విదేశాలకు పరారయ్యారు. ఈ కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో ఏడు దేశాలకు బుధవారం లేఖలు రాసింది. ఈ దేశాల్లో నీరవ్ మోదీ, చోక్సీలకు వ్యాపారాలు ఉన్నాయి.

pnb
  • Loading...

More Telugu News