Jana Sena: ఎన్నారై వింగ్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్!

  • పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేసిన ఎన్నారై కార్యకర్తలు
  • ఎన్నారై కార్యకర్తలతో పవన్ భేటీ
  • పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్న జనసేనాని

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ సభ తరువాత వరుస సమావేశాలతో ఆయన బిజీగా గడిపారు. ఇందులో భాగంగా సభకు విచ్చేసిన ఎన్నారై వింగ్ తో ఆయన ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను, పార్టీ నిర్మాణాన్ని వారికి పవన్ కల్యాణ్ వివరించనున్నారు. దాదాపు 40 మంది ఎన్నారై కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం వామపక్ష నేతలతో ఆయన సమావేశం కానున్నారు. 

Jana Sena
Pawan Kalyan
nri
supporters
  • Loading...

More Telugu News