maoists: ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టుల ఆయుధాలను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

  • మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ధ్వంసం
  • 1976 నుంచి 2009 వరకు స్వాధీనం చేసుకున్న 1,575 ఆయుధాలు
  • పోలీసు శిక్షణా కేంద్రంలో రోడ్డు పరిచి రోలర్ తో తొక్కించిన పోలీసులు

కర్నూలు జిల్లా పోలీసులు 1,575 తుపాకులను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా రోడ్డు రోలర్ తో తొక్కించిన ఘటన స్థానికుల్లో ఆసక్తి కలిగించింది. 1976వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం మధ్యకాలంలో ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు, ఇతర నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం 1,575 ఆయుధాలను కర్నూలు పోలీసు శిక్షణ కేంద్రంలో రోడ్డుపై పరిచి రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనల మేరకు అందరి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించామని కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ తెలిపారు. రోలర్‌ తొక్కిన అనంతరం ధ్వంసమైన ఆయుధాలను ఒక గుంతలో వేసి కాల్చి, శిధిలాలను పూడ్చిపెట్టారు.  ఇందులో 260 ఎస్బీబీఎల్‌ గన్నులు, 256 ఎస్బీఎంఎల్‌ గన్నులు, 78 బీబీఎల్‌ గన్నులు, 522 పిస్టళ్లు, 364 రివాల్వర్లు, 93 రైఫిళ్లు, ఒక స్టెన్‌ గన్‌, ఒక తపంచా, ఒక ఎయిర్‌ గన్‌, ఎయిర్‌ పిస్టళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

maoists
terrorists
guns
Police
  • Loading...

More Telugu News