Chandrababu: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

  • కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు
  • పవన్ ప్రసంగం ముగిసిన తరువాత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
  • మేనిఫెస్టో నచ్చే 2014లో మద్దతిచ్చారుగా
  • అప్పట్లోనే మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని చెప్పాం
  • ఇప్పుడు కులాల మధ్య కుమ్ములాట పెట్టామనడం ఏంటన్న చంద్రబాబు

ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం సాగిస్తుంటే కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా తమను ఆడిపోసుకోవడం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగం ముగిసిన తరువాత అర్థరాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని నిలదీసి డిమాండ్లను సాధించుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో చౌకబారు విమర్శలు చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

 కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామాలు కూడా చేసి, నిత్యమూ పార్లమెంట్ వేదికగా పోరాటం సాగిస్తుంటే ఈ తరహా విమర్శలు ఏంటని అన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారని గుర్తు చేస్తూ, మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టామని, నాడు టీడీపీ మ్యానిఫెస్టోను సమర్థించి, ప్రచారం చేసిన పవన్, నేడు కులాల మధ్య చిచ్చు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించడం ఏంటని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News