Pawan Kalyan: పవన్ ను కలిసేందుకు వచ్చిన 40 మంది ఎన్నారైలు... నేడు కీలక భేటీ!

  • ఇక ప్రజాక్షేత్రంలోకి పవన్ కల్యాణ్
  • నేడు ప్రవాస భారతీయులతో భేటీ
  • ఆపై వామపక్ష నాయకులతో కూడా

నిన్న గుంటూరు సమీపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్, ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లే క్రమంలో భాగంగా నేడు కీలక భేటీలు జరపనున్నారు. ఈ ఉదయం విజయవాడలో పవన్, 40 మంది ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. వీరిలో పెట్టుబడిదారులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, ఐటీ కంపెనీల్లో ఉన్నతోద్యోగులుగా ఉన్నవారు ఉన్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. వీరందరూ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఎన్నారైలతో భేటీ తరువాత వామపక్ష నేతలతోనూ పవన్ సమావేశమై, చర్చలు సాగించనున్నారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలతో కలసి పోటీ చేయాలని ఇప్పటికే జనసేన నిర్ణయించుకున్న నేపథ్యంలో పొత్తు, ఆపై రాజకీయ ఎత్తుగడలు, ప్రభుత్వ అవినీతిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు సాగుతాయని తెలుస్తోంది.

Pawan Kalyan
NRIs
Left Parties
Vijayawada
  • Loading...

More Telugu News