USA: స్కూల్ లో గర్జించిన తుపాకీ.. ముగ్గురికి గాయాలు

  • కాలిఫోర్నియాలోని స్కూల్ లో కాల్పుల కలకలం
  • సేఫ్టీ క్లాస్ చెబుతుండగా తుపాకీ మిస్ ఫైర్
  • ముగ్గురు విద్యార్థులకు గాయాలు

కాలిఫోర్నియాలోని స్కూల్‌ లో కాల్పుల కలకలం రేగింది. తరగతి గదిలో తుపాకీ కాల్పులు వినబడడంతో స్కూల్ లో విద్యార్థులు భయంతో బిక్కచచ్చిపోయారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... కాలిఫోర్నియాలోని సీసైడ్ హైస్కూల్‌ లో న్యాయతరగతుల్లో భాగంగా రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ అయిన డెనిస్ అలెగ్జాండర్ గన్ సేఫ్టీ తరగతులు నిర్వహిస్తున్నాడు. పాఠం చెబుతూ, గన్ లోడ్ అయిందో లేదో చెక్ చేస్తుండగా, పొరపాటున గన్ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ షెల్స్ తగిలి ఓ విద్యార్థి మెడకు గాయం కాగా, మరో ఇద్దరు విద్యార్ధులకు తూటా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులకు తరగతులు చెప్పేందుకు డెనిస్ అలెగ్జాండర్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్ తీసుకోవడం విశేషం.

USA
California
gunfire
school fire
  • Loading...

More Telugu News