Pawan Kalyan: పవన్ కల్యాణ్.. బహిరంగ సభలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది : ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి

  • అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానం కరెక్టు కాదు
  • ఉమ్మడి ఏపీకి సంబంధించిన నివేదికను పవన్ ప్రస్తావించారు
  • నారా లోకేశ్ పై పవన్ వ్యాఖ్యలు అర్థరహితం : లంకా దినకరన్

అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ స్పందించారు. 2015కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాడు ఎన్జేఈఆర్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని, బహిరంగ సభలో మాట్లాడేముందు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. తాజా నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా చూస్తే అవినీతిలో 20వ స్థానంలో ఏపీ ఉందని పేర్కొన్న దినకరన్, నారా లోకేశ్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, కేవలం ఆరోపణలు గుప్పించారని అన్నారు.

Pawan Kalyan
Telugudesam
lanka dinakaran
  • Loading...

More Telugu News