Pawan Kalyan: ముఖ్యమంత్రి అయ్యాకే పోరాడతానంటే ఎలా?: జ‌గన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు

  • ముఖ్యమంత్రి అయితేగానీ జగన్ అసెంబ్లీకి రారా?
  • పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడా?
  • అయినా పోరాటం చేయడానికి ప్రజల ముందుకు రాలేదా?
  • సమస్యలపై పోరాడాలంటే ముఖ్యమంత్రి కావాలా?

కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోందని, అలాగే వైసీపీ నాయకులు ప్రజల తరఫున నిలబడి టీడీపీని నిలదీస్తూ బలంగా పోరాడతారా అంటే వారు అసెంబ్లీకే వెళ్లడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ రోజు గుంటూరులో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి అయితేగానీ జగన్ అసెంబ్లీకి రారా?.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడా.. అయినా పోరాటం చేయడానికి ముందుకు రాలేదా.. సమస్యలపై పోరాడాలంటే ముఖ్యమంత్రి కావాలా.. ఈ విధానం వైసీపీ నేతలు తెలుసుకోనంత కాలం ప్రజల సమస్యలు తీర్చాలన్న లక్ష్యం నేరవేరదు' అని వ్యాఖ్యానించారు.

'ఏపీ యువత ప్రాణాలను నేను ఫణంగా పెట్టను. నా నేల కోసం మాతృభూమి కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. టీడీపీకి ప్రజల మీద నా అంతటి ప్రేమ ఉందా?.. జనం మీద సాటి మనుషుల బాధలకు చలించే పోయే గుణం చంద్రబాబుకి ఉందా? అసెంబ్లీలో కూర్చొని ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు.. భావోద్వేగ పూరితంగా మాట్లాడుతున్నారు.. గుంటూరులో కలరా వచ్చి అంతమంది చనిపోయే మీకు భావోద్వేగం కలగలేదా? శ్రీకాకుళంలో ప్రతి ఏడాది సుమారు 55 మంది శిశు మరణాలు సంభవిస్తున్నాయి ఏం జరుగుతుందో రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు' అని పవన్ కల్యాణ్ చంద్రబాబుని విమర్శించారు.

  • Loading...

More Telugu News