Pawan Kalyan: ఇటీవల తెలంగాణ నాయకులు టీవీలో మాట్లాడుతూ అలా అన్నారు.. నేనలా చేయను: పవన్ కల్యాణ్

  • హోదా పోరాటాన్ని తెలంగాణ పోరాటం జరిగినంత బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని అన్నారు
  • ఆ మాటలు వింటే నాకనిపించింది ఏపీ రాజకీయాలు అంత సున్నితమైనవా అని
  • మందు పాతరలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడి రాజకీయ నాయకులు
  • మిగతా వారిలా వెళ్లి బలిదానాలు చేసేయండి అని నేను అనను

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కారణం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన గుంటూరులో మహాసభలో మాట్లాడుతూ.. "ఏ పరిస్థితుల్లో నేను 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చాను. మీకు పదవులు అప్పజెప్పి మీ కాళ్లతో తొక్కించుకోవడానికా?.. మీతో, మీ పిల్లలతో తొక్కించుకోవడానికా? ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తోంటే కంచె చేను మేస్తోంటే కాపరి ఏం చేయగలడు అనే సామెత గుర్తొస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్ధృతంగా పోరాడాల్సి వస్తుంది. మేము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతాం.
 
ఇటీవల మన తెలంగాణ నాయకులు టీవీలో మాట్లాడుతూ అలా అన్నారు.. ప్రత్యేక హోదా పోరాటాన్ని తెలంగాణ పోరాటం జరిగినంత బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని అన్నారు. ఆ మాటలు వింటే నాకనిపించింది ఏపీ రాజకీయాలు అంత సున్నితమైనవా అని. మందు పాతరలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడి రాజకీయ నాయకులు. నిరాయుధలని హత్య చేస్తారు, మొన్న కడపలో ఏం జరిగిందో చూశాం.

అవసరమైతే ప్రాణ త్యాగం చేసి అయినా అన్న తన తమ్ముళ్ల ప్రాణాలను కాపాడుకుంటాడు. మిగతా వారిలా వెళ్లి బలిదానాలు చేసేయండి అని నేను అనను. వారి సమాధులపై కూర్చొని రాజకీయాలు చేయను. నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేనో సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని మా నాన్న మంగళగిరిలో ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు. నాకు అన్ని బాధ్యతలు తెలుసు. రాజకీయాల్లో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. 

  • Loading...

More Telugu News