Chandrababu: వైసీపీ లాలూచీ రాజకీయాలను ఎండగట్టండి : సీఎం చంద్రబాబు

  • అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
  • కుట్రలకు పాల్పడే వారు చెప్పి చేయరు
  • ఆ కుట్రలను సకాలంలో బయటపెట్టాలి: చంద్రబాబు

వైసీపీ లాలూచీ రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని తమ పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీరుపై, వైసీపీ వ్యవహార శైలిపై చర్చించారు. కుట్రలకు పాల్పడే వారు చెప్పి చేయరని, ఆ కుట్రలను సకాలంలో బయటపెట్టకపోతే మనం విఫలమవుతామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ‘దళిత తేజం’ తరహాలో మే నెల నుంచి అక్టోబర్ వరకు బీసీ, ఎస్టీ, మైనారిటీ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News