virendra sehwag: యువీ, గేల్ రెండు మ్యాచ్ లు ఆడితే చాలు: సెహ్వాగ్

  • యువరాజ్, గేల్ బేస్ ప్రైస్‌ కే మాకు దక్కడం అదృష్టం
  • వారిద్దరూ రెండు మ్యాచ్ లలో విజృంభిస్తే చాలు
  • ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే

టీమిండియా హార్డ్ హిట్టర్ యువరాజ్ సింగ్, విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఇద్దరూ ఆడితే చాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పంజాబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ, వాళ్లిద్దరూ బేస్ ప్రైస్‌ కే దక్కడం తమ జట్టు అదృష్టమని అన్నాడు. వారిద్దరి కోసం వేలంలో పోటీ పడాల్సి వస్తే కనీసం మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. ఆ ఇద్దరికీ అనుభవం, మంచి పేరు ఉన్నాయని గుర్తుచేశాడు. వారిద్దరూ మ్యాచ్ విన్నర్సేనని సెహ్వాగ్ తెలిపాడు. వాళ్లిద్దరూ రెండు మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేస్తే వారికోసం యాజమాన్యం పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో వారిద్దరూ ఆడనున్నారు.

virendra sehwag
Yuvraj Singh
chris gyle
kings 11 punjab
  • Loading...

More Telugu News