Telugudesam mp: పాస్టర్ గెటప్ తో పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీ శివ ప్రసాద్

  • పూటకో వేషంతో పార్లమెంటును రక్తికట్టిస్తున్న ఎంపీ శివప్రసాద్
  • చర్చి పాస్టర్ వేషధారణలో పార్లమెంటు ఆవరణలో కలియదిరిగిన శివప్రసాద్
  • విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్

పూటకో వేషంతో పార్లమెంటును రక్తికట్టిస్తున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ నేడు చర్చి పాస్టర్ వేషధారణతో చట్టసభలో అడుగుపెట్టారు. పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన ఆందోళనలో పాస్టర్ వేషధారణతో పాల్గొన్న శివప్రసాద్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేతిలో బైబిల్ పట్టుకుని పార్లమెంటు ఆవరణలో ఏపీకి అనుకూలంగా, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గత వారం శ్రీకృష్ణ పరమాత్మ గెటప్ వేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

Telugudesam mp
parliment
shiva prasad
  • Loading...

More Telugu News