Uttar Pradesh: యూపీ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా మారిన ఫలితం... ఫుల్ పూర్ లో ఓటమి దిశగా బీజేపీ!

  • తొలుత రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
  • కౌంటింగ్ జరుగుతూ ఉంటే దూసుకొచ్చిన సమాజ్ వాదీ అభ్యర్థి
  • ఫుల్ పూర్ ఎస్పీకి, గోరఖ్ పూర్ బీజేపీకి
  • బీహార్ లోనూ బీజేపీకి ఆర్జేడీ నుంచి గట్టిపోటీ

ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పరాజయం తప్పేలా లేదు. యూపీలో ఫుల్ పూర్, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా, తొలుత రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్న బీజేపీ, ప్రస్తుతం ఫుల్ పూర్ లో వెనుకంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ మద్దతుతో బరిలోకి దిగిన సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ విజయం దిశగా వెళుతున్నారు. ఇక, యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్ పూర్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ పటేల్ ముందంజలో ఉన్నారు. ఇక బీహార్ లోనూ బీజేపీకి పూర్తి అనుకూల ఫలితాలేమీ వెలువడే పరిస్థితి కనిపించడం లేదు. అరారియా లోక్ సభ లో బీజేపీ లీడింగ్ లో ఉండగా, భాబువా అసెంబ్లీలో గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఇక్కడ జేడీ(యూ) అభ్యర్థి సమీప ఆర్జేడీ అభ్యర్థిపై 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జహానాబాద్ లో ఆర్జేడీ విజయం దిశగా దూసుకెళుతోంది.

  • Loading...

More Telugu News