Sindhu Menon: నటి సింధూ మీనన్ తో పాటు ఆమె సోదరుడిపైనా పోలీసు కేసు!

  • ఓ బ్యాంకును మోసం చేసిందని ఆరోపణలు
  • లీజుకు తీసుకున్న భవనాన్ని తాకట్టు పెట్టేయత్నం
  • నకిలీ పత్రాలు సృష్టించిన సింధు, ఆమె సోదరుడు

దక్షిణాది సినీ నటి సింధూ మీనన్ ను కష్టాలింకా వీడలేదు. మూడు రోజుల క్రితం ఓ బ్యాంకును మోసం చేసిందన్న ఆరోపణలపై సింధూ మీనన్ పై కేసు రిజిస్టర్ చేసిన కర్ణాటక, యశ్వంత్ పురా పోలీసులు, తాజాగా, ఆమె సోదరుడు మనోజ్ కార్తీపైనా కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, మనోజ్ కార్తీ, సింధు, మరో ఇద్దరు కలసి గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజ్ కు తీసుకున్నారు. ఆ భవనాన్ని తమదిగా చూపి బ్యాంకు రుణం తీసుకోవాలన్న ఉద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించారు. అయితే, ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన భవన యజమాని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సింధుపై తొలుత, ఆపై ఆమె సోదరుడిపై కేసు పెట్టారు.

Sindhu Menon
Karnataka
Lease
Bank Fruad
  • Loading...

More Telugu News