jaya bhachan: నరేశ్ అగర్వాల్ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జయాబచ్చన్‌ స్పందన

  • జయాబచ్చన్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో నరేశ్ అగర్వాల్ తీవ్ర వ్యాఖ్యలు
  • సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు ఇచ్చారని తనకు ఇవ్వలేదని ఆగ్రహం
  • మీడియాతో మాట్లాడిన జయాబచ్చన్‌
  • తాను చాలా మొండి మనిషినని, ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వనని వ్యాఖ్య

సమాజ్ వాదీ పార్టీ నుంచి తనను కాదని జయాబచ్చన్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో ఇటీవల నరేశ్ అగర్వాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు టిక్కెట్ ఇవ్వడం సిగ్గుచేటని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేశ్ అగర్వాల్ వ్యాఖ్యలపై జయా బచ్చన్ స్పందించారు. తాను చాలా మొండి మనిషినని, ఇలాంటి వాటికి తాను సమాధానం ఇవ్వనని అన్నారు. కాగా, నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

jaya bhachan
naresh agarwal
BJP
  • Loading...

More Telugu News