Andhra Pradesh: మంత్రి కాలువ శ్రీనివాస్ పై మండిపడ్డ ఏపీసీసీ నేత మీసాల

  • 'ఇందిరమ్మ గృహాల'లో అవినీతి జరిగిందన్న కాలువ    
  • ఆ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి 
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయి?: మీసాల రాజేశ్వర రావు

నాడు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో కాంగ్రెస్ నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు మండిపడ్డారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో కాంగ్రెస్ నాయకులు రూ. 4,600 కోట్ల నిధులు స్వాహా చేశారనే కాలువ వ్యాఖ్యలు చట్ట సభలను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు.

ఈ విషయమై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు పూర్తి చేశారని, చట్టానికి దొరక్కుండా అవినీతికి పాల్పడడంతో కాంగ్రెస్ నాయకులపై చర్యలు చేపట్టలేకపోయారని కాలువ పేర్కొనడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని భావిస్తే తక్షణమే కేసులు పెట్టాలని, అరెస్టులు చేయాలని కాలువను ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News