Andhra Pradesh: ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: టీడీపీ నేత కూన రవికుమార్

  • విభజన చట్టం అమలుపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదు
  • పారిశ్రామిక రాయితీలకు అతీగతీ లేదు
  • విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి:  రవికుమార్

ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. విభజన చట్టం అమలుపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ చర్చను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని, పారిశ్రామిక రాయితీలకు అతీగతీ లేదని కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.

విభజన జరిగి ఇన్నాళ్లైనా ఆర్థికలోటుపై ఫార్ములా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారని, కేంద్రం సహకరించకపోయినా రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత చంద్రబాబుదని ప్రశంసించారు. రైతులకు రుణవిముక్తి కింద రూ.24 వేల కోట్లు ఖర్చుపెట్టామని, ప్రధాని మోదీకి తెలియకుండా నిధులు విడుదలయ్యాయని చెప్పి వాటిని వెనక్కితీసుకోవడం ఏమాత్రం సబబు కాదని, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ సందర్భంగా కూన రవికుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News