Revanth Reddy: ఆ వీడియో ఎక్కడ?: తెలంగాణ సర్కారుకు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

  • కేసీఆర్ ఆదేశాలతోనే ఆసుపత్రికి స్వామిగౌడ్
  • హెడ్ ఫోన్స్ తగిలినట్టు వీడియో ఎక్కడ?
  • మరో యాంగిల్ లో ఫుటేజ్ విడుదల చేయరేం?
  • ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

నిన్న తెలంగాణ అసెంబ్లీలో స్వామిగౌడ్ పై నిజంగానే దాడి జరిగితే, ఆ వీడియోను ఎందుకు బహిర్గతం చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసుపత్రిలో చేరారని ఆరోపించిన ఆయన, రైతుల సమస్యలను పరిష్కరించేందుకే తాము అసెంబ్లీలో నిరసన తెలిపామని చెప్పారు.

ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో కోమటిరెడ్డి హెడ్‌ ఫోన్స్‌ విసురుతున్నట్టు కనిపిస్తోందే తప్ప, అవి వెళ్లి స్వామి గౌడ్ కు తగిలాయని కనిపించడం లేదని, మరో యాంగిల్ లో వీడియోను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన దుయ్యబట్టారు. గవర్నర్‌ ప్రసంగం తమకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల ప్రస్తావన లేదని అన్నారు. శాసన సభ్యత్వాల సస్పెన్షన్ కు గురైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, సంపత్‌ కు కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని తెలిపారు.

Revanth Reddy
Telangana
Assembly
Swamy Goud
KCR
  • Loading...

More Telugu News