movie: షూటింగ్ లో అస్వస్థతకు గురైన అమితాబ్ ..ముంబై నుంచి జోధ్ పూర్ చేరిన వైద్యులు

  • థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్
  • షూటింగ్ లో అస్వస్థత
  • ఆసుపత్రిలో చేర్చిన చిత్ర యూనిట్

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అస్వస్థతకు గురయ్యారు. అమీర్ ఖాన్ హీరోగా విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతోంది. షూటింగ్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన జోధ్‌ పూర్‌ లోని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్సనందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక వైద్య బృందం జోధ్ పూర్ చేరుకుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

movie
Amitabh Bachchan
ameer khan
  • Loading...

More Telugu News