Swamy Goud: రెండు రోజుల తరువాతే స్వామిగౌడ్ కన్ను గురించి చెప్పగలం: సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్‌

  • ఆయన్ను ఇన్ పేషంట్ గా చేర్చుకున్నాం
  • కంటి పరీక్షలు జరిపాము
  • రెండు రోజుల తరువాతే పూర్తి వివరాల వెల్లడి
  • స్వామిగౌడ్ ను పరామర్శించిన పలువురు

మండలి చైర్మన్ స్వామిగౌడ్ కుడి కంటికి గాయమై, కార్నియా దెబ్బతిందని, ఆయన్ను ఇన్ పేషంట్ గా చేర్చుకున్నామని, మరో రెండు రోజుల తరువాతే ఆయన కన్ను ఎలా ఉందన్న విషయమై పూర్తి వివరాలు చెప్పగలమని సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల కంటి వైద్య పరీక్షలూ జరిపామని అన్నారు.

కాగా, నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సాగుతున్న వేళ, కాంగ్రస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ స్వామిగౌడ్ కు తగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న స్వామిగౌడ్ ను పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఆసుపత్రి వద్దకు వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు లోపలికి వెళ్లి స్వామిగౌడ్ ను పరామర్శించి వచ్చారు.

Swamy Goud
Telangana
Assembly
Hyderabad
Komatireddy
  • Loading...

More Telugu News