mega star: ఒక్క చోట చేరి, సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు!

  • చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పుట్టిన రోజు వేడుకలు
  • ఒక్క చోట చేరిన మెగా కుటుంబం
  • సందడి చేసి, సెల్ఫీదిగి పోస్టు చేసిన మెగా హీరోలు

మెగా హీరోలంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబం మొత్తం ఒక్కచోట చేరింది. అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వేడుకకు హాజరుకాగా, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్ అంతా సుష్మితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి, అందరం చాలా సంతోషంగా గడిపామని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది.

mega star
chiranjeevi
sushmita
birthday celebrations
  • Loading...

More Telugu News