Lokesh Rahul: టీ20ల్లో సరికొత్త చెత్త రికార్డును సృష్టించిన టీమిండియా ఆటగాడు లోకేశ్ రాహుల్!

  • నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ హిట్ వికెట్
  • టీ20ల్లో ఈ రకంగా ఔటైన తొలి ఇండియన్
  • జీవన్ మెండిస్ బౌలింగ్‌లో ఘటన

నిదహాస్ ట్రోఫీలో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు లోకేశ్ రాహుల్ సరికొత్త చెత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంక స్పిన్నర్ జీవన్ మెండిస్ వేసిన బంతిని ఆడేందుకు బ్యాక్‌ఫుట్ వేసిన రాహుల్ ప్రమాదవశాత్తు బెయిల్స్‌ను పడగొట్టి హిట్ వికెట్ అయ్యాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో హిట్ వికెట్ అయిన తొలి క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

టెస్టుల్లో లాలా అమర్‌నాథ్, వన్డేల్లో నయన్ మోగింయా హిట్ వికెట్ అయిన తొలి భారతీయులుగా రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు టీ20ల్లో లోకేశ్ రాహుల్ ఆ ‘ఘనత’ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 18 పరుగులు చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకుంది.

Lokesh Rahul
Team India
Hit-wicket
Sri Lanka
  • Loading...

More Telugu News