Andhra Pradesh: ఏపీకి రైల్వేజోన్ లేనట్టే?

  • ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని చెప్పిన కేంద్రం?
  • అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి ఏపీ సీఎస్ కు సమాచారం?

ఏపీకి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికలతో పాటు రైల్వేబోర్డు కూడా ఇందుకు వ్యతిరేకంగా ఉందని హోం శాఖ కార్యదర్శి తేల్చి చెప్పారని సమాచారం.
 
కాగా, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వర్గంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేశారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పేర్కొనడం తెలిసిందే. అయితే, ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైల్వేజోన్ వ్యవహారంలో చేతులెత్తేయడం గమనార్హం. ఏపీకి రైల్వేజోన్ రావడం ఖాయమని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న తరుణంలో ఈ వార్త వెలువడం గమనార్హం.

  • Loading...

More Telugu News