kcr: కేసీఆర్.. అదే ప్రశ్నను మిమ్మల్ని మేము అడుగుతున్నాం : కోమటిరెడ్డి

  • రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర పెంచితే నీ అయ్య సొమ్ము ఏమన్నా పోతుందా కేసీఆర్? : 
  • రాష్ట్రంలో రైతులకు నువ్వు ఇవ్వవు.. పైగా, బయటివాళ్లపై నిందలు వేస్తావా ?
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆరు సీట్ల కంటే ఎక్కువ రావు
  •  మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రైతులకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వదు. ‘ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు రైతులకు కేటాయించలేవా? నీ అయ్య సొమ్ము ఏమన్నా పోయిందా?’ అని ఈయన (కేసీఆర్) మొన్న మోదీని ప్రశ్నించారు. మరి, మేము కూడా కేసీఆర్ ని అదేవిధంగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు పెట్టారు కదా, వరి, మొక్కజొన్న, పసుపుకు మద్దతు ధర పెంచితే నీ అయ్య సొమ్ము ఏమన్నా పోతుందా కేసీఆర్? రాష్ట్రంలో రైతులకు నువ్వు ఇవ్వవు. పైగా, బయటివాళ్లపై నిందలు వేస్తావా?’ అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

మరో ఆరేడు నెలల్లో కేసీఆర్ ని సస్పెండ్ చేయబోతున్నారు

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ వేటు పడుతుందనే వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి స్పందిస్తూ, ‘మరో ఆరేడు నెలల్లో ప్రజలు, నిరుద్యోగులు, రైతులు.. కేసీఆర్ ని సస్పెండ్ చేయబోతున్నారు. కేసీఆర్ మోసపు మాటలను ప్రజలు నమ్మడం లేదు. హత్యా రాజకీయాలతో, ఓట్ల రాజకీయాలతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఆరు సీట్ల కంటే కేసీఆర్ గారికి ఎక్కువ రావు. ఇది రాసిపెట్టుకోండి’ అని కోమటిరెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News