Telangana: నా కాలు ఫ్యాక్చర్ అయింది..దానికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి కాదా? : కోమటిరెడ్డి

  • తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటన కారణం కేసీఆరే
  • బయట నియంతలా వ్యవహరించే ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా అలానే వ్యవహరించారు
  • కేసీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటన అంతటికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరే నని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బయట నియంతలాగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఇక్కడ (అసెంబ్లీ)లో కూడా అలానే వ్యవహరించారు. ఈ ఘర్షణలో మాకు గాయాలయ్యాయి. ఎవరి మీదా మేము ఏమీ వెయ్యలేదు. ఎవరిపైనా దాడి చేయలేదు. దాడి చేసే అలవాటు ఉంది కేసీఆర్ గారి ఎమ్మెల్యేలకే ఉంది. అసెంబ్లీలో మేము ఎవరిపైనా దాడి చేయలేదు. వాళ్లే మాపై దాడి చేశారు. నా కాలు ఫ్యాక్చర్ అయింది..దానికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి కాదా? మమ్మల్ని పోడియం వద్దకు వెళ్లనీయకుండా మార్షల్స్ ని అక్కడ ఎందుకు పెట్టాలి? మొదటి తప్పు వాళ్లది. మేము మైక్ సెట్ విసరలేదు. ఆందోళనలో కొన్ని పేపర్లు చింపి.. విసిరేశాం అంతే’ అని అన్నారు.

Telangana
kcr
komati reddy
  • Loading...

More Telugu News