samantha: సమంతను చూడడానికి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు

  • అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్డులో ఘటన
  • ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించడానికి వచ్చిన సమంత
  • ఈ ఘటనతో అభిమానులతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన సమంత

సినీనటి సమంతను చూడడానికి వచ్చిన ఓ అభిమాని అత్యుత్సాహం చూపి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న ఘటన అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్డులో చోటు చేసుకుంది. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించడానికి సమంత ఈ రోజు అక్కడకు వచ్చింది. ఆమెను చూడడానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. ఓ అభిమాని సమంతను చూడడానికి ముందుకు దూసుకొచ్చి అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు అతడిని వెనక్కినెట్టేశారు. దీంతో ఆ అభిమాని పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. దీంతో సమంత షోరూంను ప్రారంభించి అభిమానులతో మాట్లాడకుండానే వెళ్లిపోయింది.

  • Loading...

More Telugu News