Telangana: చట్టపరంగా కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలి : మంత్రి తలసాని

  • స్వామిగౌడ్ పై కోమటిరెడ్డి దాడి చేయడం దుర్మార్గమైన చర్య
  • కాంగ్రెస్ సభ్యుల తీరు ఆక్షేపణీయంగా ఉంది
  • తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది : తలసాని

ఈరోజు ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే నిమిత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగలడం విదితమే. ఈ సంఘటనపై మంత్రి తలసాని యాదవ్ స్పందిస్తూ, స్వామిగౌడ్ పై కోమటిరెడ్డి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని, గూండాల్లా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న పథకాలను చూసి కాంగ్రెస్ సభ్యులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News