Tamilnadu: ప్రధాని నివాసం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన తమిళనాడు రైతు నేత
- సుప్రీం తీర్పుకి కేంద్రం వక్రభాష్యాలు చెబుతోంది
- తక్షణం కావేరీ జల నిర్వాహక మండలి ఏర్పాటు చేయాలి
- కేంద్రానికి దక్షిణ భారత రాష్ట్రాల నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను హెచ్చరిక
ప్రధాని నివాసం ముందు ఆత్మహత్యకు పాల్పడతానని దక్షిణ భారత రాష్ట్రాల నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను హెచ్చరించారు. ఈ రోడ్ లో ఆయన మాట్లాడుతూ, ఆరు వారాల్లోపు కావేరీ నిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వం కొత్త భాష్యాలు చెబుతూ తమిళనాడు రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. తక్షణం కావేరీ జల నిర్వాహక మండలిని ఏర్పాటు చేయని పక్షంలో తాను ఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు.