sasikala: శశికళ, ఇళవరసి ఖైదీల యూనిఫాం ధరించడం లేదు: రేఖా శర్మ

  • బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి
  • తనిఖీల్లో భాగంగా జైలుకి వెళ్లి శశికళ, ఇళవరసిని చూసిన రేఖా శర్మ
  • ఖైదీలంతా యూనిఫాంలో ఉండగా సొంత దుస్తుల్లో శశికళ, ఇళవరసి

బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఖైదీల యూనిఫాం ధరించడం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. తనిఖీల్లో భాగంగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకి వెళ్లానని, అక్కడ శశికళ, ఇళవరసిని చూశానని ఆమె తెలిపారు. వారిద్దరూ అందరు మహిళా ఖైదీలు ధరించే యూనిఫాం కాకుండా, సొంత దుస్తులు ధరించి ఉన్నారని ఆమె తెలిపారు. దానిపై తాను జైలు సిబ్బందిని ప్రశ్నించగా, శశికళ ఉన్నత స్థాయికి చెందిన వారని, ఆమె సొంత బట్టలు వాడుకోవచ్చని సమాధానమిచ్చారని ఆమె తెలిపారు.

sasikala
ilavarasi
central jail
  • Loading...

More Telugu News