Hijra: తమిళనాడులో హిజ్రాకి ప్రభుత్వోద్యోగం..!దేశంలోనే ప్రప్రథమం
- ప్రభుత్వ ఫిజియోథెరపిస్టుగా నియామకం
- ఓ హిజ్రా ఈ పోస్టును దక్కించుకోవడం దేశంలోనే ప్రప్రథమం
- మధురై కలెక్టర్ చొరవతో ఉద్యోగం దక్కించుకున్న వైనం
దేశంలోనే తొలిసారిగా ఓ హిజ్రా ప్రభుత్వ ఫిజియోథెరపిస్టుగా ఉద్యోగం పొందారు. తద్వారా తొలిసారిగా ఈ ఉద్యోగం సాధించిన హిజ్రాగా రికార్కులకెక్కారు. ఆ హిజ్రా పేరు సోలు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, సాత్తూర్ సమీపంలోని ఓ కుగ్రామంలో జన్మించారు. సోలు తన హైస్కూలు చదువు పూర్తికాగానే కోయంబత్తూర్ వెళ్లి అక్కడ నాలుగున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ కోర్సు చేశారు. మధురై జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సోలుకు పలు ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా సరే...పట్టువిడవకుండా మధురై జిల్లా కలెక్టరు వీరరాఘవరావును ఆశ్రయించారు. ఎట్టకేలకు ఫిజియోథెరపిస్టు ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. సోలు రోగులకు తనదైన శైలిలో సేవలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.