raghuveera reddy: చంద్రబాబు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే.. కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు: రఘువీరా

  • తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం
  • థర్డ్ ఫ్రంట్ కూడా కేసీఆర్ ను కాపాడలేదు
  • ఏపీలో అన్ని పార్టీలు ఏకమై, కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

ఎన్డీయే నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు వస్తారన్న ఉద్దేశంతోనే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే థర్డ్ ఫ్రంట్ పల్లవి అందుకున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఫ్రంట్ పేరుతో ఆయన ఊగిసలాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే... టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, థర్డ్ ఫ్రంట్ పెట్టినా నిలదొక్కుకోవడం కష్టమని జోస్యం చెప్పారు. ప్రధాని కావాలనే దురాలోచన కేసీఆర్ కు ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చడానికి టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అన్నీ ఒకే తాటిపైకి వచ్చి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

raghuveera reddy
KCR
third front
  • Loading...

More Telugu News