somu veerraju: ఇతర పార్టీల నేతలు మాతో టచ్ లో ఉన్నారు: సోము వీర్రాజు

  • బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు
  • రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది
  • కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని... అయినా కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని... అసలైన వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. తెలుగుదేశం సహా ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సుకతతో ఉన్నారని, తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

somu veerraju
BJP
Rajya Sabha elections
  • Loading...

More Telugu News