CM Ramesh: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. సీఎం రమేశ్‌కు రెండోసారి.. వర్ల రామయ్యకు చాన్స్?

  • నేడు ప్రకటించనున్న టీడీపీ
  • సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎంపిక
  • ప్రాంతాల వారీగా సమతూకం ఉండేలా చూసుకున్న సీఎం చంద్రబాబు

రాజ్యసభ అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఓ నిర్ణయం తీసేసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగుస్తున్న సీఎం రమేశ్‌కు రెండోసారి అవకాశం కల్పించాలని భావిస్తుండగా, రెండో స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలోకి దింపాలని యోచిస్తోంది. చివరి క్షణంలో అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప వీరిద్దరి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు.

ప్రాంతాల వారీగా చూసినప్పుడు సమ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప టీడీపీకి కీలకం కావడంతో ఇక్కడి నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రమేశ్‌కు రెండోసారి అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తుండగా, మరొకటి కోస్తాకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వర్ల రామయ్య పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు.

కర్నూలు నుంచి ఇప్పటికే టీజీ వెంకటేశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, అనంతపురం నుంచి ఇద్దరు మంత్రి వర్గంలో, మరో ఇద్దరు చీఫ్ విప్ పదవుల్లోనూ ఉన్నారు. నిన్నమొన్నటి వరకు కేంద్రంలో సహాయమంత్రిగా వ్యవహరించిన సుజనా చౌదరికి రెండేళ్ల క్రితం రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రమేశ్‌కు కూడా అలాగే రెండోసారి రాజ్యసభకు పంపాలని సీఎం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నేటి సాయంత్రం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News