kalyan ram: 'ఎమ్మెల్యే' పాటల పండుగకి ముహూర్తం కుదిరింది!

  • 'ఎమ్మెల్యే'గా కల్యాణ్ రామ్ 
  • ఆయన జోడీగా కాజల్ 
  • ఈ నెల 17న ఆడియో రిలీజ్

తెలుగులో కల్యాణ్ రామ్ మూవీ 'లక్ష్మీ కల్యాణం'తోనే కాజల్ కెరియర్ మొదలైంది. చాలాకాలం తరువాత మళ్లీ ఆమె ఆయన సరసన 'ఎమ్మెల్యే' సినిమా చేస్తోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ .. రీసెంట్ గా వదిలిన సింగిల్ .. ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.

మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆయన అందించిన పాటలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటల పండుగకు 'కర్నూల్' వేదిక కానుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.   

  • Loading...

More Telugu News