Sridevi: రేపు చెన్నైలో శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలంటూ....

  • శ్రీదేవికి రేపు అడయార్ హోటల్‌లో సంతాప సభ
  • కోలీవుడ్‌కి చెందిన పలువురు అతిలోకసుందరి మిత్రుల హాజరు
  • గతనెల 28న హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

అందాల తార శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలంటూ రేపు చెన్నైలో సామూహికంగా ప్రార్థన చేయనున్నారు. నగరంలోని అడయార్‌లో ఉన్న హోటల్ క్రౌనీ ప్లాజా ఇందుకు వేదిక కానుంది. ఇండియా టుడే కథనం ప్రకారం, ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ సహా తమిళ సినీ రంగానికి చెందిన కొందరు శ్రీదేవి మిత్రులు పాల్గొంటారని తెలిసింది. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో శ్రీదేవి సంతాప సభను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నటీమణులు జయసుధ, జయప్రద, అమల, నివేదా థామస్, హీరోలు జగపతిబాబు, రాజశేఖర్, కృష్ణంరాజు, గాయని పి.సుశీల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కాగా, గతనెల 28న ముంబైలోని పవన్ హన్స్ దహనవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయిన సంగతి తెలిసిందే.

Sridevi
Telugu film industry
Janhvi
Khushi Kapoor
Boney
  • Loading...

More Telugu News