tank band: రేపు ట్యాంక్ బండ్ వైపునకు రావద్దు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి: హైదరాబాద్ సీపీ
- 'మిలియన్ మార్చ్' ఘటన స్ఫూర్తితో రేపు ర్యాలీకి టీజేఏసీ పిలుపు
- అనుమతి నిరాకరించిన పోలీసులు
- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు
తెలంగాణ ఉద్యమ సమయం ఉద్ధృతంగా జరుగుతోన్న సమయంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై 'మిలియన్ మార్చ్' నిర్వహించిన విషయం తెలిసిందే. ఉద్యమంలోని ఆ ఘట్టం స్ఫూర్తితో రేపు ట్యాంక్‌బండ్‌పై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, యువకులు భారీగా తరలిరావాలని ప్రజలకు టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇటీవలే పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షను తెలంగాణ సర్కారుకి ఈ ర్యాలీ ద్వారా గుర్తుచేద్దామని అన్నారు. అయితే, ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రదేశం కాబట్టి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపినప్పటికీ ఈ ర్యాలీని కొనసాగించాలని అనుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు. ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.