Sridevi: శ్రీదేవి మృతిపై నెలకొన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ!

  • అనుమానించదగ్గ విషయాలు లేవు
  • ఏమైనా ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేవి
  • దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదు

సినీ నటి శ్రీదేవి మరణం వెనుక మరేదైనా కోణం ఉందా? అనే సందేహాలకు భారత విదేశాంగ శాఖ ఫుల్ స్టాప్ పెట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ, తనకు తెలిసినంత వరకు యూఏఈ ప్రభుత్వం నుంచి మనకు పూర్తి స్థాయి నివేదిక అందిందని చెప్పారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని చెప్పారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని తెలిపారు.

ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఓ హోటల్లో బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. పొరపాటున బాత్ టబ్ లో పడి, చనిపోయిందని దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 28న అధికారిక లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి.  

Sridevi
death
mea
clarification
  • Loading...

More Telugu News