stock markets: చివరి గంటలో బేర్ మన్న మార్కెట్లు.. కొనసాగిన పతనం!
- చివరి గంటలో లాభాల స్వీకరణకు దిగిన ఇన్వెస్టర్లు
- 44 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 16 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో... ఈ ఉదయం నుంచి మన స్టాక్ మార్కెట్లు జోరుగానే కొనసాగాయి. కానీ, చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 44 పాయింట్లు కోల్పోయి 33,307కు పడిపోయింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 10,227 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సెంట్రల్ బ్యాంక్ (9.68%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (7.84%), డీబీ కార్ప్ (6.13%), రతన్ ఇండియా పవర్ (6.07%), ఒబెరాయ్ రియాలిటీ (5.39%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-9.74%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-7.64%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (-6.40%), కెనరా బ్యాంక్ (-6.09%), ఐడీబీఐ బ్యాంక్ (-5.54%).