chiranjeevi: 'సైరా' రెండవ షెడ్యూల్ వచ్చే నెలకి వాయిదా

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
  • ఈ వారంలో మొదలు కావలసిన సెకండ్ షెడ్యూల్ 
  • కొన్ని కారణాల వలన వాయిదా  

మెగా అభిమానులంతా 'సైరా' సినిమా విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం రెండవ షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కావలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ వచ్చేనెలకి వాయిదా పడినట్టుగా చెబుతున్నారు.

వచ్చేనెల మొదటివారంలో ఈ షెడ్యూల్ మొదలుకానుందని అంటున్నారు. ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నయనతార ఈ షెడ్యూల్లో జాయిన్ కానుందని కూడా చెప్పారు. చిరంజీవి కెరియర్లోనే ప్రతిష్ఠాత్మక చిత్రం కానుండటం వలన, క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదట. అందువల్లనే ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది.   

  • Loading...

More Telugu News