raghuveera reddy: టీడీపీ, బీజేపీల గుర్తింపును రద్దు చేయండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

  • హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయి
  • సెక్షన్ 16ఏ కింద రెండు పార్టీలను రద్దు చేయండి
  • 5 కోట్ల ఆంధ్రులను మోసం చేశారు

తెలుగుదేశం, బీజేపీల గుర్తింపును రద్దు చేయాలంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, 5 కోట్ల ఆంధ్రులను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. విభజన సమయంలో 15 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ... ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ నేతలు ఇచ్చిన వాగ్దానాలను ఆధారాలతో సహా ఈసీకి సమర్పించామని చెప్పారు. సెక్షన్ 16ఏ కింద రెండు పార్టీలను రద్దు చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, మోదీకి నైతిక విలువలు ఉంటే... ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ-బీజేపీలు ఎప్పుడు కలిసి ఉంటాయో? ఎప్పుడు విడిపోతాయో? ఎవరూ చెప్పలేరని ఎద్దేవా చేశారు.

raghuveera reddy
kvp ramachandra rao
BJP
Telugudesam
election commission
  • Loading...

More Telugu News